ప్రముఖ యూట్యూబర్, పైలట్, స్మార్ట్ జోడీ కంటెస్టెంట్ రీతు రాథీ తనకు చిన్నతనంలో ఎదురైన చేదు సంఘటనను వెల్లడించింది. ప్రస్తుతం రీతు రాథీ తన భర్తతో కలిసి స్టార్ ప్లస్ షో 'స్మార్ట్ జోడీ' షోలో పాల్గొంటుంది. ఈ షోలో భాగంగా పిల్లలకు మంచి, చెడు స్పర్షల గురించి కచ్చితంగా వివరించాలని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తనకు నాల్గొ తరగతిలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వివరించింది.
'మా క్లాస్‌లో గౌరవ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను ఎప్పుడూ నా ముందు బెంచ్‌లో కూర్చునేవాడు. అప్పట్లో మనకు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఓపేన్‌గా చెక్క బెంచీలు ఉండేవి. ముందు వెనుక ఓపెన్‌గానే ఉండేది. ఇది అడ్వాంటేజ్‌గా తీసుకుని తన వెనుక నుంచి నా పాదాలను తాకుతూ ఉండేవాడు. అలా ఊరుకోకుండా రోజురోజుకీ ఇంకా ఎక్కువ చేసేవాడు.' ఆ సంఘటన తనను రోజు వెంటాడేదని రీతు తెలిపింది. ఇంట్లోవాళ్లకు చెబితే తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని భయపడి ఎవరికీ చెప్పలేదని పేర్కొంది.
తర్వాత తనకోసం తనే నిలబడాలనుకున్నాని చెప్పింది రీతు రాథీ. 'అప్పటికీ నాలుగు రోజులు గడిచాయి. ఏదో విధంగా అతనికి బుద్ధి చేప్పాలని ధైర్యం తెచ్చుకున్నాను. ఒకరోజు మేము పాఠశాల నుంచి బయలుదేరేటప్పుడు మెట్లు దిగితూ అతన్ని పిలిచాను. ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూసెటప్పుడు మూడు, నాలుగు చెంపదెబ్బలు వేసి అక్కడి నుంచి పారిపోయాను. మరుసటి రోజు ఎలాంటి పరిణామాలు జరిగిన ఎదుర్కొవాల్సిందే అనుకుంటూ భయపడుతూనే వెళ్లాను. కానీ ఆ అబ్బాయి నా కళ్లలోకి చూడలేకపోయాడు. నేను కనపడితే చాలు దాక్కొవడం మొదలుపెట్టాడు. ఇదివరకు నేను ఎలా అతన్ని చూసి దాక్కున్నానో అలాగే.' అని చెప్పుకొచ్చింది రీతు. తన కుమార్తెకు కూడా మంచి, చెడు స్పర్శల గురించి వివరిస్తానని, అలాంటి సమయాల్లో భయపడకుండా ఎలా ధైర్యంగా ఉండాలో చెబుతానని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment