వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం యూరప్‌కు చెందిన జెయో, ఇలోనాలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో పర్యాటకులు సైతం రామప్పకు తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రొఫెసర్లు రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేయూలో రెండు రోజుల సెమినార్ ముగించుకొని అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్లు వెల్లడించారు.
రామప్పలో యూరప్ దేశస్తులు