వెంకటాపురం(ఎం): నర్సరీలోని మొక్కలు చనిపోకుండా ప్రతీ మొక్కను జాగ్రత్తగా పెంచాలని ములుగు ఏపీడీ వెంకటనారాయణ ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. మండల పరిధిలోని నల్లగుంట, లక్ష్మీదేవిపేట, వెంకటాపురం మండల కేంద్రంలోని నర్సరీలను ఆయన బుధవారం పరిశీలించారు. మొక్కల వివరాలు, రిజిస్టర్లను పరిశీలించి ఈజీఎస్ సిబ్బందితో మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించారు. పనుల వద్ద కూలీలకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నారగోని సునిత, ఈసీ సురేష్, ప్లాంటేషన్ మేనేజర్ కిశోర్, పంచాయతీ కార్యదర్శులు దామోదర్, రమేష్, ప్రసాద్, ఎఫ్‌ఏలు రామాచారి, సునీత, రాధిక, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీడీ వెంకటనారాయణ