మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలోని హుండీల కానుకల లెక్కింపు ద్వారా రూ.6.67లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ తెలిపారు. హేమాచల క్షేత్రంలోని 8హుండీలను ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరకాల డివిజన్ పరిశీలకులు నందనం కవిత పర్యవేక్షణలో గురువారం లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ప్రధాన ఆలయంతో పాటు వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 8హుండీలలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా రూ.6,67,933ఆదాయం సమకూరినట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, కై ంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖర్‌శర్మ, సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, శేషు, లక్ష్మినారాయణ, సిబ్బంది, మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం శ్రీవారి భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.