ములుగు: 2025–2026 విద్యా సంవత్సరానికి గాను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రవేశ కరపత్రాలను కలెక్టర్ దివాకర తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. గత విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యాపోటీ పరీక్షల్లో సాధించిన విజయాలతో రూపొందించిన కరపత్రాన్ని సైతం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొప్పుల మల్లేశం, వైస్ ప్రిన్సిపాల్ బాలయ్య, న్యాక్ కో ఆర్డినేటర్ కవిత, దోస్త్ కన్వీనర్ శంకర్, సభ్యురాలు శిరీష తదితరులు పాల్గొన్నారు.
రమేష్‌కు డాక్టరేట్
ములుగు రూరల్: ఉస్మానియా యూనివర్సిటీలో వృక్షశాస్త్రంలో ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన పోరిక రమేష్ డాక్టరేట్ సాధించారు. వృక్షశాస్త్ర విభాగంలో మాలిక్యలర్‌జెనిటిక్స్ అండ్ బయోటెక్నాలజీ లేబోరేటరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో స్టడీస్ అన్ పైటోకెమికల్ ప్రొపైలింగ్ అండ్ దేర్ బయోలాజికల్ యాక్టివిటీస్ ఆఫ్ ఆర్గిరియో క్యూనియాటా(విల్డ్) కెర్‌గావ్ల్ అంశంపై పరిశోధన సాగించారు. ఈ అంశంపై సమర్పించిన గ్రంధానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు. రమేష్ డాక్టరేట్ సాధించడంతో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, తోటి పరిశోధకులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
విద్యుత్ ప్రమాదాలపై
అప్రమత్తం
ములుగు రూరల్: విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్‌శాఖ ఏఈ రవి అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని బండారుపల్లిలో అధికలోడ్‌తో ఉన్న 63కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 100కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను గురువారం బిగించారు. ఈ సందర్భంగా విద్యుత్ పొలంబాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ ప్రమాదాలపై ఆయన మాట్లాడారు. కెపాసిటర్ బిగించడం వల్ల కలిగే లాభాలను, ఎలక్ట్రికల్ పరికరాల ఎర్తింగ్ పద్ధతులపై రైతులకు వివరించారు. వ్యవసాయ బావుల వద్ద అటోమెటిక్ స్టార్టర్‌ల వల్ల కలిగే దుష్ప్రభావాలను, విద్యుత్ సర్వీస్ వైరు నాణ్యత, ప్రామాణికతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ వేణుగోపాల్, వెంకట్‌రెడ్డి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
వన్యప్రాణులను వేటాడిన వ్యక్తి అరెస్ట్
ములుగు రూరల్ : వన్యప్రాణులను వేటాడి మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని ములుగు అటవీశాఖ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్‌ఆర్‌ఓ డోలి శంకర్.. నిందితుడి అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. ములుగు మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన ధనసరి సాంబయ్య వన్యప్రాణి మాంసాన్ని విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు తనిఖీ చేయగా మాంసం లభించింది. అనంతరం విచారించగా పస్రా రేంజ్ పరిధిలోని బుస్సాపూర్ అటవీప్రాంతంలో ఉచ్చులు అమర్చగా సాంబార్ (కనుసు పిల్ల) పడడంతో తల , కాళ్లు అక్కడే కాల్చి తిన్నారు. చర్మం అక్కడే వదిలేసి మాంసం కన్నాయిగూడెం తీసుకొచ్చాడు. నిందితుడి సమాచారం మేరకు బస్సాపూర్ అటవీ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి మాంసం, చర్మంతో పాటు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. దాడుల్లో డీఆర్‌ఓ శోభన్, బీట్ ఆఫీసర్ చైతన్య, ఎఫ్‌బీఓ శ్యాంసుందర్, రూప్‌కుమార్, శివక్రిష్ణ, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
కరపత్రాల ఆవిష్కరణ
కరపత్రాల ఆవిష్కరణ
కరపత్రాల ఆవిష్కరణ