
నిరుపయోగంగా శానిటేషన్ వాహనం
పరకాల : లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన శానిటేషన్ వాహనం మర మరమ్మతుకు నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. రెండేళ్ల క్రితం రూ.85 లక్షలతో కొనుగోలు చేసిన వాహనం మూడు నెలల క్రితం రిపేరుకు వచ్చింది. మున్సిపల్ వద్ద ఎలాంటి నిధులు లేకపోవడంతో మరమ్మతులు చేయించలేదు. దీంతో ప్రధాన రహదారులపై చెత్త, చెదారం పేరుకపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు రోడ్లపై పేరుకపోయిన దుమ్ము వాహనదారుల కళ్లలో పడుతూ తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు మున్సిపల్ శానిటేషన్ వాహనానికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.