
అకాల వర్షం.. ఆగమాగం
వెంకటాపురం(కె):మరికాలలో గోదావరిలో ఆరబోసిన మిర్చిపై టార్పాలిన్ కప్పుతున్న రైతులు
వెంకటాపురం(కె)/వాజేడు/కన్నాయిగూడెం: జిల్లాలో గురువారం సాయంత్రం పలుచోట్ల గాలిదుమారం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రైతులు ఆగమాగం అయ్యారు. వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల పరిధిలో కలాల్లో ఆరబోసిన పంటను కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. వర్షానికి తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు కప్పారు. మరికొంతమంది మిర్చిని రాశులుగా పోసి టార్పాలిన్లు కప్పారు. అలాగే పలుచోట్ల కోతకు దశకు చేరుకుంటున్న వరి పంట సైతం నేలవాలింది. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని వాజేడు తహసీల్దార్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉష్ణోగ్రతలు సైతం తగ్గే అవకాశం ఉందని వివరించారు.
కన్నాయిగూడెంలో..

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం