
అకాల వర్షంతో ఆందోళన
మంగపేట: అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మండలంలో గురువారం సాయంత్రం గాలులతో భారీ వర్షం పడింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ గాలులతో గంటన్నర పాటు భారీ వర్షం దంచి కొట్టింది. అయినప్పటికీ వాతావరణ శాఖ రెండు రోజుల ముందు నుంచే అకాల వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించడంతో రైతులు ముందస్తుగా తగిన జాగ్రతలు పాటించడంతో పెద్దగా ఎక్కడ కూడా నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. మిర్చి కల్లాల్లో ఉన్నప్పటికీ రైతులు వర్షానికి తడవకుండా కవర్లు కప్పి ఉంచడంతో నష్టం జరుగలేదు. ఆడ మగ వరి సాగు చేసిన రైతులకు కొంతమేర నష్టం కలిగించిందని రైతులు తెలిపారు.

అకాల వర్షంతో ఆందోళన