
ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలి
వెంకటాపురం(ఎం): ఉచిత న్యాయ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పిలుపునిచ్చారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. గుట్కా, సిగరెట్, పొగాకు తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురికావడమే కాకుండా బంగారు భవిష్యత్తును యువత కోల్పోతుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ కౌన్సిల్ రాజ్‌కుమార్, స్టాఫ్‌నర్స్ మణెమ్మ పాల్గొన్నారు.