
ట్రేడ్స్‌మెన్లను నియమించాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని ఓపెన్ కాస్ట్‌లో ట్రెడ్స్‌మెన్లను నియమించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఏరియాలోని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్– 2లోని గని మేనేజర్ కృష్ణప్రసాద్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఓసీ 3కి ఎవరిని డిప్యూటేషన్‌పై బదిలీ చేయొద్దని, హెల్పర్లను ఇవ్వాలని, కాలం చెల్లిన యంత్రాలను తొలగించాలని కోరారు. రిటైర్మెంట్ అయిన టెక్నీషియన్ల స్థానాలను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. ట్రేడ్స్‌మెన్లపై అధికారులు అగౌరవంగా, అవమానకరంగా వ్యవహరించొద్దని అన్నారు. కార్యక్రమంలో ట్రేడ్స్‌మెన్లు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, బీఎంఎస్ నాయకులు మధుకర్‌రెడ్డి, రాజేందర్, ఏబూసి ఆగయ్య, సుజేందర్, రఘుపతి, సమ్మిరెడ్డి, శ్రీనివాస్, చేరాలు, నారాయణ, కృష్ణ రవీందర్, పర్వతాలు పాల్గొన్నారు.