
విద్యుత్ ఉద్యోగుల భద్రతే లక్ష్యం
ములుగు రూరల్: విద్యుత్ ఉద్యోగుల భద్రతే లక్ష్యమని భూపాలపల్లి, ములుగు ఎస్‌ఈ మల్చూర్‌నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ములుగు, మల్లంపల్లి, గోవిందరావుపేట, ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలాలకు చెందిన విద్యుత్ ఉద్యోగులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల భద్రతే లక్ష్యంగా నూతన కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యుత్ ఉద్యోగులు లైన్ మరమ్మతులు, పోల్‌పై పనిచేసే ముందు, తర్వాత ఫొటోలను, సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఎల్‌సీ ఇచ్చేముందు ఏఈతో సమన్వయం చేస్తూ పనిచేసే విధంగా యాప్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రతీ పనిని ఆన్‌లైన్ చేసిన తర్వాతనే చేయాలని సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈలు మల్లేశం, నాగేశ్వర్‌రావు, ఏడీఈ వేణుగోపాల్, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్‌ఈ మల్చూర్‌నాయక్