
అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఎన్నిక
ములుగు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకల ఉత్సవ కమిటీని దళిత సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి శ్యాంబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడిగా చంటి భద్రయ్య, గౌరవ అధ్యక్షుడిగా ఇరుగుపైడి మాదిగ, ఉపాధ్యక్షుడిగా ముంజాల భిక్షపతిగౌడ్, కార్యదర్శిగా రొంటాల భిక్షపతి, గౌరవ సలహాదారుడిగా గుగ్గిళ్ల సాగర్, ప్రచార కమిటీ సభ్యులుగా సుకుమార్, నక్క భిక్షపతి, చుంచు రవి, మాట్ల సంపత్, వట్టెం జనార్ధన్, బొమ్మకంటి రమేష్ వర్మ, బీట్ల కొంరయ్య, నక్క రాజు, కర్ణాకర్‌మాదిగ, మరాఠి రవీందర్‌మాదిగ, రాహుల్‌నాయక్, కాకి రవిపాల్, కార్తీక్ మాదిగ, వావిలాల స్వామి, చెన్నం స్వామి, తోకల శివ తదితరులను ఎన్నుకున్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని తీర్మాణం చేశారు.