
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
అమ్రాబాద్: ప్రజాపాలనలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దని అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ సూచించారు. గురువారం పదర మండలం ఇప్పలపల్లి రైతువేదికలో క్లస్టర్ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్, సీసీ రోడ్ల నిర్మాణం తదితర సమస్యలను స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడమేగాక రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని వివరించారు. లక్ష్యంతో పని చేస్తున్న ప్రభుత్వానికి అధికారులు సహకరించాలని సూచించారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అంతకుముందు మద్దిమడుగులో పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం అమ్రాబాద్ పోచమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో క్లస్టర్ అధికారులు, మద్దిమడుగు ఆలయ కమిటీ అధ్యక్షుడు రాములునాయక్, నాయకులు రామలింగయ్యయాదవ్, జెట్టెప్ప, రాములుగౌడ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment