నేడు సబ్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక
కల్వకుర్తి రూరల్: ఉప్పునుంతల మండలం వెల్టూరు జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ బాలబాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి యాదయ్యగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2009 ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారై ఉండటంతో పాటు 55 కిలోల బరువు ఉండాలని సూచించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్, ఎస్‌ఎస్‌సీ మెమో, బోనఫైడ్ సర్టిఫికెట్‌తో రావాలని తెలిపారు. పూర్తి వివరాలకు ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేష్, మోహన్‌లాల్‌తో పాటు 99516 29694, 99125 24385 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
పంటల సాగులో
విత్తన ఎంపిక కీలకం
బిజినేపల్లి: మొక్కజొన్న పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే విత్తన ఎంపిక కీలకమని రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డా.సుజాత అన్నారు. పాలెం కేవీకే ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ఖానాపూర్‌లో క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సుజాత మాట్లాడుతూ.. మొక్కజొన్న సాగులో సరైన సమయంలో యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు. మొక్కజొన్నలో మేలైన విత్తనాలు, పద్ధతులను వివరించారు. పాలెం కేవీకే సమన్వయకర్త డా.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటలో అధిక దిగుబడి పెంచుకునే అవకాశాలు ఉన్నాయని.. ఇందులో ఎరువుల యాజమాన్యం ముఖ్యమైనదని అన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా.మలయ్య, వాణిశ్రీ,, సమత, పరమేశ్వరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment