కల్వకుర్తి టౌన్: మున్సిపల్ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ హెచ్చరించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో కొత్తగా స్వయం సహాయక మహిళా సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు పాత సంఘాలకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన సభ్యులందరికీ సీ్త్రనిధి రుణాలు అందించాలని తెలిపారు. తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో మేనేజర్ రాజకుమారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శివ, రిసోర్స్ పర్సన్‌లు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment