నేడు జిల్లా కోర్టులో మెడికల్ క్యాంపు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా కోర్టు ఆవరణలో శనివారం మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి సబిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్ క్యాంపులో న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు చేస్తారని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని డీఐఈఓ వెంకటరమణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా నాలుగు దశల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 13,454 మంది ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాజరైనట్లు వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని డీఐఈఓ తెలిపారు.
చరిత్రను ఎప్పటికీ
మరిచిపోవద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: చరిత్రను ఎప్పటికీ మర్చిపోరాదని.. గతంలో జరిగిన అనేక సంఘటనలను జీవన విధానంలో పాటించాల్సిన అవసరం ఉందని అదనపు ఎస్పీ రామేశ్వర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పురాతన నాణేల ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్దులకు పురాతన నాణేల గొప్పతనాన్ని, ప్రత్యేకను అర్థం చేసుకునేందుకు అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. చరిత్రను అధ్యయనం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గత అనుభవాలను తెలుసుకుని వాటి ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పురాతన నాణేలు ఏ సంవత్సరానికి చెందినవనే విషయాన్ని చరిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ధర్మ, డా.హజీరా ఫర్విన్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణయ్య పాల్గొన్నారు.
బైపాస్ బాధితులకు న్యాయం చేయాలి
నాగర్‌కర్నూల్‌రూరల్: చారగొండలో ఎన్‌హెచ్–167కే బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందికొండ గీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చారగొండలో నేషనల్ హైవే బైపాస్ బాధితులకు అరకొర పరిహారం చెల్లించి.. బలవంతంగా ఇళ్లు కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో 12 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 24న కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పొదిల రామయ్య, సభ్యులు అశోక్, సురేష్, చంద్రశేఖర్, నాగరాజు, తిరుపతయ్య ఉన్నారు.
నేడు జిల్లా కోర్టులో మెడికల్ క్యాంపు
నేడు జిల్లా కోర్టులో మెడికల్ క్యాంపు
Comments
Please login to add a commentAdd a comment