ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలి
కల్వకుర్తి టౌన్: ఇంటర్మీడియట్, పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని డీఈఓ రమేష్ కుమార్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటర్, పదో తరగతి విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. వార్షిక పరీక్షలంటే భయం వీడి.. ఉత్సాహంగా ముందుకెళ్లాలని విద్యార్థినులకు డీఈఓ సూచించారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థినిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఉత్తమ ఫలితాలు రాబట్టాలన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థినులకు మంచి పోషకాలతో కూడిన ఆహారం అందించాలన్నారు. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరయ్యేలా సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం కేజీబీవీలో ఉన్న రికార్డులను పరిశీలించి, పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. డీఈఓ వెంట ఎస్‌ఓ రమాదేవి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment