అయిజ: మండల కేంద్రంలోని తిక్కవీరేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ వారు శుక్రవారం అంతర్రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 20 పొటేళ్లు హోరా హోరీగా తలపడ్డాయి. అయిజ మండలానికి చెందిన సుల్తాన్ పొట్టేలు ప్రథమ స్థానంలో నిలిచి రూ.50వేలు, హైదరాబాద్‌కు చెందిన రాజావలి, ఎంజీ గ్రూప్, క్రైమ్ మేకర్ పొట్టేళ్లు ద్వితీయ, తృతీయ, నాల్గో స్థానాల్లో నిలిచి రూ.35వేలు, 20వేలు, రూ.10వేలు గెలుచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment