వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్
బిజినేపల్లి: వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శివాజీ అన్నారు. ఆదివారం మండలంలోని మమ్మాయిపల్లి, గంగారం, లట్టుపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్లు సందర్శించి.. స్థానిక రైతులతో సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో లోఓల్టేజీ కారణంగా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన చోట డీటీఆర్‌లు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే పంపించాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ సమస్య ఉంటే రైతులు నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకురావచ్చని తెలిపారు. డైరెక్టర్ వెంట విద్యుత్‌శాఖ అధికారులు శ్రీధర్, రాకేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment