
‘కమర్షియల్’పై దృష్టి
మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన బహుళ అంతస్థుల భవనాల పన్నులు
● పన్ను వసూలుకు పుర అధికారుల ప్రత్యేక కార్యాచరణ
● భవనాల ముందు డప్పు కొట్టడం, సీజ్ చేస్తున్న వైనం
● జిల్లాలో రూ.18.67 కోట్లకు గాను రూ.8.21 కోట్లు మాత్రమే రాబడి
● మరో 22 రోజుల్లో ముగియనున్న గడువు
రాజకీయ ఒత్తిళ్లతో..
జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఇళ్లకు సంబంధించి పన్నులు వసూలు బాగానే ఉన్నా.. కమర్షియల్ భవనాలకు సంబంధించి వసూలు మాత్రం జరగడం లేదు. గత కొన్నేళ్లుగా పన్నులు కట్టకుండా ఉండడం, కొంత రాజకీయం ఒత్తిళ్లు కూడా ఉండడంతో అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో చూసీచూడనట్లుగా వదిలేశారు. అయితే ప్రస్తుతం అధికారులపై కూడా పన్నుల వసూళ్లు చేయాలని ఒత్తిళ్లు వస్తుండటంతో కమర్షియల్ భవనాలపై ప్రత్యే శ్రద్ధ చూపుతున్నారు. ఎక్కువ మొత్తంలో పెండింగ్‌లో ఉన్న ఫంక్షన్ హాళ్లు, ఇతర షట్టర్లకు నోటీసులు ఇవ్వడంతోపాటు కొన్నిచోట్ల వాటికి తాళం కూడా వేస్తున్నారు. ఇటీవల కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ ఫంక్షన్‌హాల్‌తోపాటు కొన్ని కమర్షియల్ భవనాలను సైతం సీజ్ చేయడం గమనార్హం. అంతే కాకుండా ఎక్కువ మొత్తంలో పెండింగ్‌లో ఉన్న కమర్షియల్ భవనాల ముందు డప్పు చాటింపు వేసి పన్నులు కట్టేలా అవగాహన కల్పిస్తూ వినూత్న రీతిలో పన్నులు వసూలు చేస్తున్నారు. మరో 22 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ఆయా మున్సిపల్ కమిషనర్లు వందశాతం వసూలు చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు.
మున్సిపాలిటీల్లో
భవనాల పన్నులు
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఇలా..
Comments
Please login to add a commentAdd a comment