జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో రూ.లక్షలు వెచ్చించి ని
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని సీబీఎం కళాశాల వెనక భాగంలో రూ.3 కోట్లకు పైగా నిధులతో డీఆర్‌సీసీ ఏర్పాటు చేసి చెత్తను వేర్వేరుగా రీసైక్లింగ్ చేస్తున్నారు. చెత్త రీసైక్లింగ్ పక్రియను పట్టణంలోని ఎస్‌హెచ్‌జీ సభ్యులు చేపడుతున్నారు. మున్సిపాలిటీలోని 11 ఆటోలు, 3 ట్రాక్టర్లు సేకరించిన చెత్తనంతా డీఆర్‌సీసీకి చేరవేస్తారు. అక్కడ వారంతా చెత్తను రీసైక్లింగ్ చేసి, డబ్బులు సంపాదిస్తూ ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. పట్టణంలోని 22 వార్డుల నుంచి ప్రతిరోజు 15 మె.ట., చెత్త సేకరిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ తెలిపారు.
చెత్తను రీసైక్లింగ్ చేయడం వల్ల ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఒక ఆదాయ మార్గంగా మారింది. చెత్తను ఎక్కడా నిర్లక్ష్యంగా వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంతో రీసైక్లింగ్ సైతం సులభంగా ఉంటుంది. భవిష్యత్‌లో చెత్త ఎక్కువగా వస్తుందన్న ముందు జాగ్రత్తతో అందుకు తగినట్లుగా డీఆర్‌సీసీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.
– లక్ష్మి, డీఆర్‌సీసీ సభ్యురాలు, కల్వకుర్తి
ఆదాయ మార్గంగా మారింది
మహిళా సంఘాల
ఆధ్వర్యంలో..
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో రూ.లక్షలు వెచ్చించి ని
Comments
Please login to add a commentAdd a comment