కొల్లాపూర్‌లో కార్మికుల కొరత
కొల్లాపూర్: మున్సిపాలిటీలో చెత్త సేకరణకు సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రధాన కూడళ్లలో తిరుగుతున్న చెత్త సేకరణ వాహనాలు శివారు ప్రాంతాల్లోకి సకాలంలో రాకపోవడంతో ప్రజలు చెత్తను రోడ్లపై పారవేస్తున్నారనే ప్రచారం ఉంది. మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా.. పట్టణంలో 16 వార్డులకు చెందిన ప్రజలు నివశిస్తున్నారు. మున్సిపల్ అనుబంధ గ్రామాల్లో 4 వార్డులు ఉన్నాయి. కొల్లాపూర్ పట్టణంలో రోజూ 8 టన్నుల మేరకు చెత్తను మున్సిపల్ సిబ్బంది సేకరిస్తున్నారు. వీటిలో వీటిలో పొడి చెత్త 3.1 టన్నులు, తడి చెత్త 1.8 టన్నులు, మిక్స్‌డ్ చెత్త 3.9 టన్నుల మేర ఉంటోంది. పొడి చెత్తను 1వ వార్డు, తడి చెత్తను ఈదమ్మబావి వద్ద ఉన్న కంపోస్టు యార్డు, మిక్స్‌డ్ చెత్తను అమరగిరి వెళ్లే దారిలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే వరిదేల చెరువు కట్టపై, చుక్కాయిపల్లి చెరువుకట్ట సమీపంలో, చౌటబెట్లకు వెళ్లేదారిలో రోడ్డు పక్కనే మున్సిపల్ సిబ్బంది చెత్తను పారబోస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిర్వహణపై దృష్టిసారించాలి
కొల్లాపూర్‌లో చెత్త సేకరణపై అధికారులు దృష్టి సారించాలి. పెంట్లవెల్లికి వెళ్లే దారిలో రోడ్డు పక్కన మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో మురుగుతోపాటు చెత్త మొత్తం రోడ్ల పక్కనే పడుతోంది. ఆ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు ఇది ఇబ్బందికరంగా మారింది. మున్సిపల్ అధికారులు దీనిపై దృష్టిపెట్టి సమస్యకు పరిష్కారం చూపాలి.
– వెంకటనర్సింహరెడ్డి, కొల్లాపూర్
●
కొల్లాపూర్‌లో కార్మికుల కొరత
Comments
Please login to add a commentAdd a comment