
నల్గొండ: దేశం గర్వించదగిన చంద్రయాన్ – 3 విజయవంతం అవడం, ఈ మిషన్ ప్రాజెక్ట్‌లో ఉండటం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు.. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన కోటగిరి శ్రీలేఖ. ఇస్రోలో టెస్టింగ్ అండ్ అనలిస్ట్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ లాండర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆమె చంద్రయాన్–3 సక్సెస్‌ను శనివారం ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రపంచం చూపు ఇస్రో వైపు ఉంది. ఇలాంటప్పుడు నేను ఇస్రోలో వర్క్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. చేయబోయే పనులకు ఎంతో బూస్టింగ్‌గానూ ఉంది.
నేను పుట్టి పెరిగింది నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామం. మా తల్లిదండ్రులు కోటగిరి శంకర్, కోటగిరి పద్మ. సూర్యాపేటలో 8వ తరగతి చదువుకున్నా. ఆ తర్వాత చదువురీత్యా మా అన్నయ్య, నన్ను హైదరాబాద్‌లోనే ఉంచారు. ఐఐటీ జెఈఈలో ర్యాంకు వచ్చాక, మా అన్నయ్య ఇచ్చిన గైడెన్స్‌తో స్పేస్ సైన్స్ తీసుకున్నా. అన్నయ్య టీచింగ్ ఫీల్డ్‌లో ఉండటం కూడా నాకు బాగా హెల్ప్ అయ్యింది. తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువు పూర్తయ్యాక ఇస్రోలో జాబ్ వచ్చింది. ఈ పదేళ్లలో ఎన్నో మిషన్ ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యాను.
వర్క్ షెడ్యూల్స్ ప్రకారం టైమింగ్ గురించి అస్సలు బేరీజు వేసుకోవడం ఉండదు. అచీవ్‌మెంట్ వైపుగానూ దృష్టి ఉంటుంది. ఉద్యోగమూ, కుటుంబమూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. నా వర్క్ షెడ్యూల్స్‌ని, మా ఐదేళ్ల అమ్మాయి పెంపకం విషయంలో బ్యాలెన్స్ మా కుటుంబం నుంచి ఉండే సపోర్ట్ నాకు పెద్ద బలం.
Comments
Please login to add a commentAdd a comment