కోదాడ: ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టతరమవుతున్న ఈ రోజుల్లో చిలుకూరు మండలం జెర్రిపోతులగూడేనికి చెందిన అక్కాచెల్లెళ్లు రెండేసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. జెర్రిపోతులగూడేనికి చెందిన పందిరి అమృతారెడ్డి–లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె లంకెల తేజస్విని ఇంజనీరింగ్ పూర్తిచేసి 2020లో జైలు వార్డర్‌గా ఉద్యోగం సాధించింది.
ప్రస్తుతం ఆమె ఖమ్మం జిల్లా జైలులో పనిచేస్తూ.. 2024 డీఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనపరిచి మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన నూతన ప్రభుత్వ ఉపాధ్యాయుల జాబితాలో ఎస్‌జీటీగా ఎంపికై ంది. ఈమె చెల్లెలు ప్రియాంక 2023లో సివిల్ ఎస్‌ఐగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రొబేషనరీ ఎస్‌ఐగా చర్లపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. ఇటీవల ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో కూడా ప్రియాంక మంచి ర్యాంక్ సాధించింది. అక్కాచెల్లెల్లిద్దరూ గ్రూప్–1 ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని, తమ విజయంలో కుటుంబ సభ్యులు అందించిన సహకారం మరువలేనిదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment