పరిశుభ్రతతోనే ఆరోగ్యం
తిప్పర్తి: విద్యార్థులు పరిశుభ్రత పాటిస్తేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి అన్నారు. గురువారం తిప్పర్తి మండలం కేశరాజుపల్లి ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధి అనేది శరీరంలో ఏ భాగానికై నా రావచ్చన్నారు. రెండేళ్లకు ఒకసారి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులువు అవుతుందన్నారు. ఈ సదస్సుకు హాజరైన డీఎంహెచ్‌ఎం పుట్ల శ్రీనివాస్ ముందుగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశిలించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. ఈ సదస్సులో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ మమత, ఇన్‌చార్జి హెచ్‌ఎం సులోచన, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్‌లు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ అప్పగించాలి
నల్లగొండ: పెండింగ్ సీఎంఆర్ చెల్లించని మిల్లర్లపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సీఎంఆర్, బ్యాంకు గ్యారంటీ తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 2023–24 యాసంగికి సంబంధించి 9వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను మిల్లర్లు చెల్లించాల్సి ఉందని, మార్చి 10లోగా చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డీఎం హరీష్, డీసీఓ పత్యానాయక్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్లు
రామగిరి(నల్లగొండ): దీర్ఘకాలికంగా రీచార్జ్ చేయకుండా ఇన్‌యాక్టివ్ 2, డియాక్టివ్ అయిన వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్లను వినియోగించుకోవాలని సంస్థ జనరల్ మేనేజర్ పి.వెంకటేశ్వర్లు కోరారు. గురువారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. రూ.1,199కే ఏడాది పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్, నెలకు 24జీబి డేటాతో పాటు రోజుకు 100 మేసేజ్‌లు లభిస్తాయన్నారు. స్పెషల్ టాప్ ఆఫ్ ఓచర్ రూ.1,39కి 28 రోజుల పాటు అపరిమిత కాల్స్‌తో రోజుకు 1.5 జీబి డేటా లభిస్తుందన్నారు. సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీస్ సెంటర్, ఆన్‌లైన్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చన్నారు.
సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లు పరిశీలన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 23న నిర్వహించే స్వర్ణ దివ్య విమాన గోపురం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను గురువారం డీసీపీ రాజేశ్‌చంద్ర పరిశీలించారు. ప్రధానాలయం, మాడ వీధులు, ఘాట్ రోడ్డు, యాగశాల ప్రాంతాలను పరిశీలించారు. భద్రతపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
పరిశుభ్రతతోనే ఆరోగ్యం
Comments
Please login to add a commentAdd a comment