ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించాలి
నల్లగొండ : హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఆహార భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. రెస్టారెంట్లు, హోటళ్లు, బడ్డీ కోట్లు, తోపుడు బండ్లు వద్ద వాడిన నూనెలను తిరిగి వాడడం, కాలపరిమితి ముగిసిన సరుకుల వాడకం వంటివి జరకుండా చూడాలన్నారు. అలా చేసే హోటళ్లను సీజ్ చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో కేజీబీవీలు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యార్థులు, పేషెంట్లకు భోజనం సరఫరా అవుతుందని.. అక్కడ కూడా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ కల్తీ ఆహార పదార్థాలను వినియోగించినందుకు ఇప్పటివరకు జిల్లాలో 16 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో జిల్లా అధికారి స్వాతి, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, డీఏఓ శ్రవణ్‌కుమార్, డీఈఓ భిక్షపతి, ఎస్బీ డీఎస్పీ రమేష్, డాక్టర్ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment