బాలల హక్కులను పరిరక్షించాలి
రామగిరి(నల్లగొండ ): బాలల హక్కులను పరిరక్షించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టులో బాలల హక్కులపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకూడదన్నారు. పనిలో నియమించుకునే వారిపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖ అధికారులు చట్టాలను వినియోగించాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.దీప్తి మాట్లాడుతూ పారా లీగల్ వలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదులు, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలకు ఈ వర్కషాప్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జడ్జిలు సంపూర్ణ ఆనంద్, రోజారమణి, దుర్గాప్రసాద్, కవిత, కులకర్ణి, సౌందర్య, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వెంకట్‌రెడ్డి, గిరి లింగయ్య, డిఫెన్స్ న్యాయవాదులు నిమ్మల భీమార్జున్‌రెడ్డి, మిర్యాల లెనిన్‌బాబు, ప్రసాద్, రమణరావు, న్యాయవాదులు వెంకట్‌రెడ్డి, బ్రహ్మచారి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు
Comments
Please login to add a commentAdd a comment