కేంద్ర పన్నుల డివిజన్ కార్యాలయం ప్రారంభం
నల్లగొండ టౌన్ : నల్లగొండలో కేంద్ర పన్నుల అసిస్టెంట్ కమిషన్ నల్లగొండ డివిజన్ నూతన కార్యాలయాన్ని సోమవారం జాయింట్ కమిషనర్ శ్రీచరణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్లు ప్రవీణ్, విమల్, సోమేజా, సూపరింటెండెంట్లు ఆలె శ్రీనివాస్, కొండ అశోక్, మురళి, విశాల్, హవల్‌దార్, మరి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
పన్నులు వందశాతం వసూలు చేయాలి
కట్టంగూర్ : గ్రామాల్లో పన్నులను వందశాతం వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కొండ వెంకయ్య ఆదేశించారు. సోమవారం కట్టంగూర్ మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పన్నుల వసూలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలపై పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి నెలాఖరుకు వరకు పన్నులు వసూలు పూర్తిచేయాలన్నారు. వేసవిలో నీటి కొరత ఏర్పడితే రైతుల నుంచి బోరుబావులను అద్దెకు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డివిజన్ పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్‌రావు, ఎంపీఓ చింతమళ్ల చలపతి ఉన్నారు.
యూజీసీ సదస్సుకు ఆహ్వానం
డిండి : మండల పరిధిలోని తవక్లాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ముద్దాడ బాల్‌రాజుకు ఈనెల 6, 7వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూర్‌లో నిర్వహించే యూనిర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సదస్సుకు ఆహ్వానం అందింది. ఎడ్యుకేషనల్ ఫర్ స్పిక్టిన్స్ అండ్ రోల్ ఆఫ్ టీచర్ ఎడ్యూకేటర్స్ ఇన్ ఇండియా అనే అంశంపై నిర్వహించే ఈ సదస్సులో బాల్‌రాజు ప్రసంగించనున్నారు. ఉపాధ్యాయుడిగా, భోధనా విధానాల విశ్లేషకుడిగా, పోటీ పరీక్షల విషయ నిపుణుడిగా సేవలందిస్తున్న బాల్‌రాజు యూజీసీకి హాజరుకావడంపై ఎంఈఓ గోప్యానాయర్, హెచ్‌ఎం రాజేందర్‌రెడ్డి, వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు.
రాయితీ పొంది.. బిల్లు చెల్లించాలి
రామగిరి(నల్లగొండ) : బిల్లు బకాయి పడిన బీఎస్‌ఎస్‌ఎల్ వినియోగదారులు లోక్ అదాలత్‌లో పాల్గొని రాయితీలను పొంది బిల్లు చెల్లించాలని బీఎస్‌ఎన్‌ఎల్ ఉమ్మడి నల్లగొండ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.వెంకటేశం సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని.. బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆర్.యుగేందర్ 944100 0146, పులిపాటి ప్రసాద్ 9494443696 ఫోణ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
కేంద్ర పన్నుల డివిజన్ కార్యాలయం ప్రారంభం
కేంద్ర పన్నుల డివిజన్ కార్యాలయం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment