భరోసా సెంటర్లతో మహిళలకు రక్షణ
నల్లగొండ : భరోసా సెంటర్ల ద్వారా బాధిత మహిళలకు రక్షణ కలుగుతుందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు అంచించాల్సిన సహాయక చర్యలపై సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మహిళలపై జరిగే నేరాలను నివారించడంలో భరోసా కేంద్రం చేసిన కృషి, ప్రస్తుతం అందిస్తున్న సేవలు, కార్యాచరణ ప్రణాళికలను, బాలల హక్కుల పరిరక్షణ, బాలలపై హింసను అరికట్టడంలో తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. బాలలతో సంబంధం కలిగిన కేసులపై దృష్టి సారించాలని ఆదేశించారు. కేసుల విచారణ వేగవంతం చేసి బాధితుల పునరావాసం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. భరోసా సేవలను గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించాలని సంబందిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కులకర్ణి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ చైర్‌పర్సన్ దీప్తి, మౌనిక, హరికృష్ణ, కృష్ణ, మోహన్‌రావు, హరిత, శ్రీధర్, గణేష్, అంజలి, నళిని, అధికారులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
Comments
Please login to add a commentAdd a comment