అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతామని వీసీ ఖాజాఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం ఎంజీయూలో 2160 చదరపు మీటర్ల ఇండోర్ స్టేడియం ఫ్లోరింగ్, 400 మీటర్ల ఎనిమిది లేన్ల ట్రాక్‌ను సింథటిక్ ట్రాక్‌గా మార్చేందుకు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యూనివర్సిటీలో క్రీడా ప్రాంగణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. అధునాతన సింథటిక్ ట్రాక్‌తో ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, షటిల్, బాస్కెట్ బాల్, కబడ్డీ లాంటి క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈపీఐ ప్రతినిధులు నారాయణ నాయక్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం వరకు క్రీడా ప్రాంగణాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ హరీష్‌కుమార్, ప్రొఫెసర్ ఆకుల రవి, స్పెషల్ ఆఫీసర్ సోమలింగం, మురళి, శ్రీనివాస్‌రెడ్డి, చింత శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment