కేతేపల్లి: మినీ వాహనంలో అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం కేతేపల్లి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన వికాస్‌కుమార్, మితిలేష్ రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మినీ వాహనంలో హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో కేతేపల్లి మండలం ఇనుపాముల జంక్షన్ వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు వీరి వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తున్న బియ్యం రేషన్ బియ్యం అని గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివతేజ తెలిపారు.