భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌లో శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం, పంటపొలాల మధ్య శుక్రవారం జాజిరి జాజిరి అనే జానపద పాటను చిత్రీకరించారు. ఎన్‌ఎస్ మ్యుజిక్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ పాటలో చిత్రీకరణలో డ్యాన్సర్లు జాను లిరి, కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు. నమ్రత్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామానికి చెందిన నిర్మాత నూకల అశోక్ యాదవ్ మాట్లాడుతూ బావ, మరదలు మధ్య జరిగే సరసాలతో జానపద పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.