సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందజేయాల్సిన గ్రామ, వార్డు
● సమీప సచివాలయాల
గ్రూపింగ్‌కు రంగం సిద్ధం
● రెండు రోజుల్లో ప్రక్రియ
పూర్తి చేయాలని ఆదేశాలు
● ఉద్యోగులను రెండు కేటగిరీలుగా
విభజన
● మొదటి దశలో
టెక్నికల్ ఫంక్షనీర్స్‌పై దృష్టి
● అనంతరం మల్టీపర్పస్ ఫంక్షనీర్స్‌కు
కదలిక
● ప్రభుత్వ చర్యతో తిరిగి
ప్రారంభం కానున్న రాజకీయ ఒత్తిళ్లు
మళ్లీ అవే కష్టాలు
గ్రామ/ వార్డు వ్యవస్థ ఆవిర్భావానికి ముందు మూడు, నాలుగు గ్రామాలకు ఒక్క పంచాయతీ కార్యదర్శి మాత్రమే ఉండేవారు. వ్యవసాయ అసిస్టెంట్లు ఎక్కడో ఉండేవారో తెలియని పరిస్థితి. అవసరాలకు అనుగుణంగా సర్వేయర్లు లేకపోవడంతో కూడా పలు మండలాల్లో ఇన్‌చార్జ్ సర్వేయర్లతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న సచివాలయాల క్లస్టర్ల విధానంతో పాత రోజులు పునరావృతం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రూపింగ్‌లో భాగంగా తీసుకోబోయే నిర్ణయాలతో ఆయా సచివాలయాల్లోని కీలకమైన ఉద్యోగులు రెండు, మూడు గ్రామాలకు ఒకరు ప్రకారం పనిచేయాల్సిన పరిస్థితులు మళ్లీ రానున్నాయి. గ్రామాల్లో సర్వేయర్ల సమస్య తీవ్రంగా వేధించే అవకాశం కూడా లేకపోలేదు.
కర్నూలు(అర్బన్): ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారు. అప్పట్లో ఈ వ్యవస్థను పరిశీలించి వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆదర్శ వ్యవస్థను ప్రజలకు దూరం చేసే కుట్ర చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే సచివాలయాల గ్రూపింగ్ పేరుతో సమీపంలో ఉన్న రెండు, మూడు సచివాలయాలను ఒకే క్లస్టర్ కిందకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయా గ్రామ/వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే గ్రామ/వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను టెక్నికల్ ఫంక్షనీర్స్, మల్టీపర్పస్ ఫంక్షనీర్స్‌గా రెండు విభాగాలుగా విభజించారు. ప్రస్తుతం ప్రతి సచివాలయంలో అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన క్లస్టర్ ప్రక్రియ పూర్తి అయితే ముందుగా టెక్నికల్ ఫంక్షనీర్స్‌గా గుర్తించిన ఉద్యోగులు ఒక్కొక్కరు రెండు లేక మూడు సచివాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయా కేటగిరిలకు చెందిన మిగిలిన ఉద్యోగులను ఖాళీగా ఉన్న ప్రాంతాలకు లేదా ఇతర శాఖలకు బదలాయించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. టెక్నికల్ ఫంక్షనీర్స్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ఆయా సచివాలయాల పరిధిలోని జనాభాను అనుసరించి మల్టీపర్పస్ ఫంక్షనీర్స్‌పై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి.
ఫంక్షనీర్స్ ఎవరంటే..
● వీఆర్‌ఓ, సర్వే అసిస్టెంట్, ఏఎన్‌ఎం, అగ్రికల్చర్/హార్టికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధశాఖ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్‌లను ప్రభుత్వం టెక్నికల్ ఫంక్షనీర్స్‌గా గుర్తించింది.
● మల్టీ పర్పస్ ఫంక్షనీర్స్‌గా పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్‌ను గుర్తించారు.
మొదటి దశలో
టెక్నికల్ ఫంక్షనీర్స్‌పై దృష్టి
సచివాలయాల గ్రూపింగ్ పూర్తి అయిన వెంటనే టెక్నికల్ ఫంక్షనీర్స్‌ను కదలించే చర్యలు ప్రారంభం కానున్నాయి. ఒక సచివాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇక నుంచి సమీపంలోని రెండు, మూడు సచివాలయాల్లో కూడా సేవలు అందించాల్సి ఉంటుంది. క్లస్టర్ పరిధిలోకి వచ్చిన రెండు, మూడు సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లను జిల్లాలో ఎక్కడైనా ఆ పోస్టులు ఖాళీగా ఉంటే అక్కడికి బదిలీ చేయవచ్చు. ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లోనైనా వీరి సేవలను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ ఫంక్షనీర్స్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ఇదే విధానాన్ని మల్టీపర్పస్ ఫంక్షనీర్స్‌గా గుర్తించి ఉద్యోగులకు కూడా వర్తింప చేయనున్నారు.
రాజకీయ ఒత్తిళ్లు ప్రారంభం
ప్రభుత్వం తీసుకున్న సచివాలయాల గ్రూపింగ్ విధానంలో రాజకీయ ఒత్తిళ్లు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమకు ఇష్టం లేని వారిని సుదూర ప్రాంతాలకు, ఇతర ఇంజినీరింగ్ విభాగాలకు పంపించాలని టీడీపీ నేతలు.. సంబంధిత అధికారులపై ఒత్తిడి చేసే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగుల బదిలీల్లో భాగంగా గత నాలుగు నెలల క్రితం ఇతర ప్రభుత్వ శాఖల్లో నిర్వహించిన విధంగానే సచివాలయ ఉద్యోగులను బదిలీ చేశారు. తిరిగి ఇప్పుడు సచివాలయాల గ్రూపింగ్ పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెడితే రాజకీయ నాయకులకు మరోసారి అవకాశం కల్పించినట్టవుతుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
కోడుమూరు మండలం
పులకుర్తి గ్రామ సచివాలయం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో జీరో వేకెన్సీకి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఆయా శాఖల్లో ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. గ్రామ/ వార్టు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1,969 పోస్టుల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియకు అప్పట్లో బ్రేకులు పడ్డాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న హేతుబద్దీకరణ పూర్తయితే కొత్త పోస్టుల భర్తీ లేనట్టే అని స్పష్టమవుతోంది.
రెండు రోజుల్లో గ్రూపింగ్ పూర్తి చేయాలని ఆదేశాలు
ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి గ్రామ/వార్డు సచివాలయాల గ్రూపింగ్‌ను రెండు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా జిల్లాలోని అందరు ఎంపీడీఓలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఎలా గ్రూపింగ్ చేయాలి, వాటి మార్గదర్శకాలకు సంబంధించిన సూచనలను ఎంపీడీఓలకు తెలియజేశాం. గ్రూపింగ్ పూర్తి అయితే సచివాలయాలు అక్కడే ఉంటాయి, కాకపోతే ఉద్యోగులకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. సమీపంలోని రెండు లేదా మూడు సచివాలయాలను ఒక క్లస్టర్ కిందకు తీసుకువస్తాం.
– జీ నాసరరెడ్డి, జెడ్పీ సీఈఓ, జీఎస్‌డబ్ల్యూఎస్ జిల్లా నోడల్ అధికారి
సచివాలయ ఉద్యోగుల వివరాలు
జిల్లా సచివాలయాలు మంజూరైన పోస్టులు విధులు నిర్వహిస్తున్న వారు ఖాళీలు
కర్నూలు 672 5,738 4,256 1,482
నంద్యాల 516 4,297 3,810 487
మొత్తం: 1,188 10,035 8,066 1,969
సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందజేయాల్సిన గ్రామ, వార్డు
Comments
Please login to add a commentAdd a comment