1. మద్యం మత్తులో రోడ్డుపై
పడిపోయిన యువకుడు
2. ఒక హోటల్‌లో డైనింగ్
టేబుల్‌పై కనిపించిన మద్యం
3. డోన్ కొండపేటలో ఒక ఇంటి వద్ద మద్యం మత్తులో
పడిపోయిన వ్యక్తి
● నిర్వాహకులు టీడీపీ నాయకులు,
కార్యకర్తలు
● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
● మత్తులో చిత్తవుతున్న సామాన్య ప్రజలు
మా దృష్టికి రాలేదు
మా సర్కిల్ పరిధిలో మద్యం బెల్టుషాపులు లేవు. వాటిని ఏర్పాటు చేస్తే ప్రజలు మాకు సమాచారం అందివ్వాలి. బెల్టుషాపుల ఏర్పాటుకు డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. అక్రమ మద్యం, నాటుసారా విక్రయందారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– వరలక్ష్మి, ఎకై ్సజ్ సీఐ, డోన్
డోన్: ప్రభుత్వ మద్యాన్ని బెల్టుషాపుల్లో విక్రయించే వారి బెల్టు తీస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటిస్తే.. అందుకు విరుద్ధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలే గ్రామానికి మూడు, నాలుగు బెల్టుషాపులను ఏర్పాటు చేస్తున్నారు. సామాన్య ప్రజలను మద్యం మత్తులో ముంచెత్తడమే లక్ష్యంగా అమ్మకాలు పెంచారు. టీడీపీ ఎమ్మెల్యేగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలో ఊరూరా బెల్టుషాపులను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఏర్పాటు చేశారు. ఒక్కొక్కషాపును ఏర్పాటు చేసేందుకు రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు డిపాజిట్ల కింద బెల్టుషాపుల యజమానుల ద్వారా సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డోన్ నియోజకవర్గంలో ఆరు జనరల్ మద్యం దుకాణాలు ఉన్నాయి. అలాగే గౌడ కులస్తులకు రెండు మద్యం షాపులు కేటాయించారు. బేతంచెర్లలో ఏడు, ప్యాపిలిలో 3 మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది.
అప్పుల కింద తాగుబోతుల ఆస్తులు
డోన్ నియోజకవర్గంలో 178 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ రెండుకు తక్కువ కాకుండా బెల్టుషాపులను టీడీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్నారు. వీటి మూలంగా అనేక గ్రామాల్లో వ్యసనపరులు ఎక్కువయ్యారు. మద్యంతో ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వారి కుటుంబాలు అప్పుల పాలై వీధిన పడుతున్నాయి. పలువురు బెల్టుషాపుల యజమానులు తాగుబోతులకు సంబంధించిన ఆస్తులను కూడా అప్పుల కింద రాయించుకుంటున్నట్లు తెలుస్తోంది.
యథేచ్ఛగా అక్రమ మద్యం విక్రయం
ఒక వైపు బెల్టుషాపులు యథేచ్ఛగా నిర్వహిస్తుండగా.. మరో వైపు అక్రమ మద్యం(కర్ణాటక టెట్రా ప్యాకెట్లు) విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వలసల, సీతమ్మ తండా, అలేబాద్ తండా, చనుగొండ్ల తదితర గ్రామాలలో నాటుసారా పెద్దఎత్తున తయారవుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం లభిస్తుండటంతో మద్యం బాబులు తాగి రోడ్లపై పడిపోతున్నారు. తాగుబోతులు మద్యం మానేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే టీడీపీ నాయకులు నాసిరకం మద్యాన్ని విక్రయిస్తున్నారని గగ్గోలు పెట్టారు. వారు అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి ప్రజలను మద్యానికి బానిసలుగా చేస్తున్నారు. సామాన్యుల ఆరోగ్యాన్ని హరిస్తున్నారు.
1
2
3
ఊరూరా ‘బెల్టు’ కిక్కు!
ఊరూరా ‘బెల్టు’ కిక్కు!
ఊరూరా ‘బెల్టు’ కిక్కు!
ఊరూరా ‘బెల్టు’ కిక్కు!
ఊరూరా ‘బెల్టు’ కిక్కు!
Comments
Please login to add a commentAdd a comment