ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోండి
నారాయణపేట: ప్రతి పోలీస్ ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందరికీ ఏఎస్పీ రియాజ్ హూల్ హక్ ఆధ్వర్యంలో జడ్చర్ల డిటిసి ట్రైనింగ్ సెంటర్‌లో వార్షిక ఫైరింగ్ ప్రాక్టీసు చేయించడం జరిగిందని ఆయన వివరించారు. ఈమేరకు ట్రైనింగ్‌ను పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, శాంతి భద్రతలు పరీక్షించడానికి పోలీసులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రజల రక్షణ కొరకు పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ ఫైరింగ్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఫైరింగ్ శిక్షణను జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ హాజరై ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సిఐలు నరసింహ, శివ శంకర్, రాజేందర్ రెడ్డి, సైదులు, ఎస్‌ఐ లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment