21న జిల్లాకు సీఎం రాక
నారాయణపేట: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 21న నారాయణపేటకు రానున్నారని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం హెలిప్యాడ్ కోసం స్థలాన్ని ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి పరిశీలించారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్, స్టేజీ తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు, వాటిలో మెడికల్ కళాశాల టీచింగ్ హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, రెండు పోలీస్ స్టేషన్ల భవన నిర్మాణాలు, పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనాలు ప్రారంభించనున్నారు. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ బెన్‌షాలం, ట్రైనీ కలెక్టర్ గరీమానరుల, అదనపు ఎస్పీ రియాజ్ హూల్ హక్, ఆర్డీఓ రాంచందర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాంకిషన్, సిఐలు శివ శంకర్, రామ్‌లాల్ ఉన్నారు.
బందోబస్తు ఏర్పాట్లు పరిశీలన
నారాయణపేట రూరల్: నూతన మెడికల్ కళాశాల వద్ద వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు సీఎం జిల్లాకు రానుండగా.. బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. మండలంలోని అప్పక్‌పల్లి శివారులో జరగనున్న కార్యక్రమానికి భద్రతతో పాటు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై జిల్లా పోలీసు అధికారులతో కలిసి పర్యవేక్షించారు. తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ఇతర అంశాలపై సమీక్షించారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు.
21న జిల్లాకు సీఎం రాక
Comments
Please login to add a commentAdd a comment