ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 18 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సివిల్ ఫిర్యాదులను కోర్టు ద్వారానే
పరిష్కరించుకోవాలి
భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారులకు ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదుదురాలతో ఎస్పీ నేరుగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను పరిశీలించాల్సిదిగా సీఐ, ఎస్‌ఐలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment