నేరాల కట్టడే ప్రధాన లక్ష్యం
మరికల్: సమాజంలో పెరుగుతున్న నేరాలను కట్టడి చేయడమే పోలీసుల ముందున్న ప్రధాన లక్ష్యమని డీఎస్పి లింగయ్య అన్నారు. మరికల్ మండల కేంద్రంలో శనివారం మాధ్వార్ రోడ్డు, గజ్జలమ గడ్డ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. మొత్తం 77మంది పోలీసులు ఆరు గ్రూపులుగా విడిపోయి 150 ఇళ్లలో సోదాలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలు, 3 గూడ్స్ ఆటోలు, కారును స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం డీఎస్పి మాట్లాడుతూ ప్రజలకు రక్షణ, భద్రతాభావం కల్పించడం తమ బాధ్యత అన్నారు. ఎవరైన కాలనీలో కొత్త వ్యక్తులు సంచరించినా.. అనుమానాస్పదంగా తచ్చాడినా వెంటనే వారి వివరాలను పోలీసులకు అందజేయాలని సూచించారు. అలాగే మహిళలు, విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని, ప్రతిఒక్కరో రోడ్డు భదత్రా నిబంధనలు పాటించాలని, లైసెన్స్ తప్పనిసరిగా వద్ద ఉంచుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ రాజేందర్‌రెడ్డి, శివశంకర్, ఎస్‌ఐలు రాము, రమేష్, కృష్ణంరాజు, రేవతి, మహేశ్వరి, నవీద్, స్పెషల్ పార్టీ బలగాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment