మరికల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపట్టే ప్రాంతాల్లో ఎండల నుంచి కూలీల రక్షణార్థం అధికారులు టెంట్లు, గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. వేసవి ఎండల నేపథ్యంలో నిలువ నీడ లేక, కనీస వసతులు కరువై కూలీలు ఇబ్బందులు పడుతుండగా ‘ఉపాధి కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి ఉపాధి హామీ అధి కారులు మరికల్‌లో ఎంపీడీఓ కొండన్న, ఏపీఎం పావని, ఏపీఓ ఊషన్న ఉపాధి కూలీల పని ప్రదేశాల్లో గుడారాలు ఏర్పాటు చేయించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు జరు గుతున్న ప్రాంతాల్లో టెంట్లు, తాగునీటి సౌకర్యం, ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచామని వివరించారు. ఎండలకు తాళలేక ఇబ్బందులు పడుతున్న కూలీలకు నీటిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కలిపి ఇస్తున్నామని, ఎండల నుంచి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
22 మంది విద్యార్థుల గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా బుధవారం పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 7,635 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 7,617మంది హాజరయ్యారు. 22మంది విద్యార్థులు గైర్హారయ్యారు. డీఈఓ గోవిందరాజులు ఏడు పరీక్ష కేంద్రాలను, ప్‌లైయింగ్ స్క్వాడ్ బృందాలు 6 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోప్రసవాల సంఖ్య పెంచాలి
ఊట్కూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా గర్భవతులకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ సౌభాగ్యలక్ష్మి సూచించారు. బుధవారం ఆమె ఊట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి మౌలిక వసతుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. డాక్టర్ సంతోషి, వైధ్య సిబ్బంది విజయ్‌కుమార్, రాజశ్రీ, శైలజ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం
కోస్గి రూరల్: నవసమాజ నిర్మాణంతోపాటు దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో యువతా యువ ఉత్సావం–2025 కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులగా హాజరై మాట్లాడుతూ.. యువత తమ ప్రతిభను వెలికితీయడానికి, నైపుణ్యాలను మెరుగుపరచుకోవాడానికి ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పలువురు విద్యార్థులు డ్రామాటిక్స్, క్రీడలు ,వక్తత్వం , సృజానాత్మక ప్రదర్శనలు మొదలైనవి చేపట్టారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యువజన అధికారి కోటానాయక్, ఏకే స్పోర్ట్స్ అకాడమీ నుంచి అంజీయాదవ్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

‘ఉపాధి’ పని ప్రదేశాల్లో టెంట్ల ఏర్పాటు

‘ఉపాధి’ పని ప్రదేశాల్లో టెంట్ల ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment