ఒక్క రేషన్‌ కార్డులో 68 మంది సభ్యులు | 1 ration card in a 68-member family of Hindus and Muslims | Sakshi
Sakshi News home page

ఒక్క రేషన్‌ కార్డులో 68 మంది సభ్యులు

Published Tue, Mar 23 2021 5:54 AM | Last Updated on Tue, Mar 23 2021 10:01 AM

1 ration card in a 68-member family of Hindus and Muslims - Sakshi

పట్నా: ఒకే కుటుంబంలో ఏకంగా 68 మంది సభ్యులతో కూడిన రేషన్‌ కార్డు ఉండటం, వారిలో హిందూ, ముస్లింలు కూడా ఉండటం కలకలం రేపింది. బిహార్‌లోని మహువా ఎస్డీఓ సందీప్‌ కుమార్‌ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. వైశాలి జిల్లాలో ఆహార ధాన్యాల పంపిణీ వివరాలను పరిశీలిస్తుండగా, ఒకే కుటుంబానికి ఏకంగా 38 క్వింటాళ్ల ధాన్యం ఇచ్చినట్లు కనిపించడంతో అధికారులు అవాక్కయ్యారు. స్థానిక రేషన్‌ డీలర్‌ సంజయ్‌కుమార్‌పై  కేసు నమోదు చేశారు. అధికారులు లబ్దిదారుల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసే పనిలోపడ్డారు.
(చదవండి: రేషన్ కోసం ప్రత్యేక యాప్ లాంచ్ చేసిన కేంద్రం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement