న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపెడుతోంది. నాలుగవ రోజు కూడా కేసుల సంఖ్య మూడు లక్షల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో 3,49,691 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది.
నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,767 మంది మృత్యువాతపడగా మొత్తం మరణాలు 1,92,311కు చేరాయి. దేశంలో ప్రస్తుతం 26 లక్షలపైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1,40,85,110 మంది డిశ్చార్జయ్యారు. 14.09 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తెలంగాణలో కొత్తగా 8,126 కేసులు
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 8,126 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు చేరింది. ఇప్పటివరకు 3,30,304 మంది డిశ్చార్జ్, 1999 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62,929 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment