![36011 New Coronavirus In India Total Cases Rise To 9644222 - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/6/Coorna.gif.webp?itok=cO8j2Z-8)
ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,011 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో 96,44,222 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనాతో 24 గంటల్లో దేశవ్యాప్తంగా 482 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,40,182కు చేరింది. కోవిడ్ నుంచి కొత్తగా 41,970 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 91,00,792గా ఉంది. ప్రస్తతం దేశంలో 4,03,248 కరోరా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14,69,86,575 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment