న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 92,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం బాధితులసంఖ్య 54,00,620 చేరింది. అయితే రికవరీ రేటు సైతం భారీగానే నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో 1,133 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 86,752కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. (రికవరీలో ప్రపంచంలో మనమే టాప్)
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 43,03,044కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య10,10,824గా ఉంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 12 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. మొత్తం మీద ఇప్పటిదాకా 6.37 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 19.10శాతంగా ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 79.28గా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో మరణాల రేటు 1.61 శాతానికి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment