ముంబై: కవలలుగా పుట్టిన అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 2న జరిగిన వింత పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారడంతో వరుడిని చిక్కుల్లో పడేసింది. ఈ విషయం చివరకు పోలీసుల దృష్టికి వెళ్లడంతో పెళ్లి కొడుకుపై బహుభార్యత్వం కేసు నమోదు చేశారు.
ఈ కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఐపీసీలోని 494 సెక్షన్ కింద నవ వరుడు అతుల్‌పై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌తోపాటు మహారాష్ట్ర మహిళా సంఘం కూడా కోరుతున్నాయి.
Twin sisters From Mumbai,got married to the same man in Akluj in Malshiras taluka of Solapur district in #maharashtra#maharashtranews#twinsisters #Mumbai #Viral #ViralVideos #India #Maharashtra pic.twitter.com/d52kPVdd5t
— Siraj Noorani (@sirajnoorani) December 4, 2022
అసలేం జరిగిందంటే
మహారాష్ట్రలోని సోలాపూర్‌కు కవల అక్కాచెల్లెళ్లు రింకీ, పింకీ అతుల్ ఉత్తమ్ అనే వ్యక్తిని ఒకే వేదికపై వివాహం చేసుకున్నారు. రింకీ, పింకీలు ఇద్దరూ ఐటీ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి అతుల్ అనే వ్యక్తితో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అతుల్‌కు ముంబైలో ట్రావెల్ ఏజెన్సీ ఉంది. కవలల తండ్రి మరణించడంతో ప్రస్తుతం వారు తల్లితో కలిసి ఉంటున్నారు.
ఆరు నెలల క్రితం రింకీ, పింకీ తల్లి అనారోగ్యానికి గురవ్వడంతో అతుల్ తన ట్యాక్సీలో వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇందుకు ఇరు కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి అంగీకరించడంతో సోలాపూర్‌లో ఘనంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి కుమార్తెలిద్దరూ కలిసి వరుడికి ఒకే పూలదండ వేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment