ఒక వ్యక్తినే పెళ్లాడిన ట్విన్‌ సిస్టర్స్‌: వీడియో వైరల్‌ | Twin Sisters Get Married Same Man In Solapur Video Goes Viral | Sakshi
Sakshi News home page

Viral Video: ఒక వ్యక్తినే పెళ్లాడిన ట్విన్‌ సిస్టర్స్‌: వీడియో వైరల్‌

Published Sun, Dec 4 2022 7:44 PM | Last Updated on Mon, Dec 5 2022 1:37 PM

Twin Sisters Get Married Same Man In Solapur Video Goes Viral - Sakshi

వివాహాలు స్వర్గంలో నిశ్చయమవుతాయంటే ఏంటో అనుకుంటాం. కొన్ని జంటలను చూస్తే అలానే అనిపిస్తాయి. ఇక్కడొక వివాహ వేడుకలో పెళ్లికూతుళ్లు ఇద్దరూ ఒక వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. చాలా వింతగా ఉన్న ఇది నిజం. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...సోలాపూర్‌లోని మల్షిరాస్‌ తాలుకాకు చెందిన అక్లూజ్‌ అనే వ్యక్తి  కవల అక్కా చెల్లెళ్లను పెళ్లిచేసుకున్నాడు. కవలలిద్దరూ ఐటీ ఇంజనీర్లే. ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఆ ఇద్దరూ కవలలు ఒక వ్యక్తినే వివాహం చేసుకున్నారు. కవల అక్కా చెల్లెళ్లు పింకీ, రింకీ చిన్నతనం నుంచి కలిసే ఉండటంతో ఒకే వ్యక్తి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదీగాక ఆ ట్విన్‌ సిస్టర్స్‌ ఇద్దరూ చూసేందుకు ఒకేలా ఉంటారని చెబుతున్నారు.  

ఇదిలా ఉండగా, ఆ కవల అక్కచెల్లెళ్లుకు కొద్దిరోజుల క్రితం తండ్రి చనిపోవడంతో తల్లితోనే కలిసి ఉంటున్నారు. ఒకసారి వాళ్ల అమ్మ ఆరోగ్యం బాగోలేనప్పుడూ ఈ అతుల్‌ అనే వ్యక్తి తన కారులో ఆస్పత్రికి తీసుకువెళ్లి సాయం అందించాడు. ఈ నేపథ్యంలోనే అతుల్‌కి ఆ ఇద్దరూ అక్కచెల్లెళ్లకు మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, అందువల్లే  ఆ కవలలిద్దరూ అతూల్‌ అనే వ్యక్తినే పెళ్లిచేసుకున్నారని మహారాష్ట్ర స్థానిక మీడియా పేర్కొంది.  అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మీరు కుడా ఓ లుక్కేయండి.
 

(చదవండి: చోరీ చేసిన సోత్తు ఏం చేశావ్‌? దొంగ రిప్లై విని ఆశ్చర్యపోయిన పోలీసులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement