కరోనా సంక్షోభం కారణంగా దేశంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్, పిల్లలకు ఆన్‌లైన్‌లో పాఠాల బోధన నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలలు పూర్తైతే ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఏడాది పూర్తి కానుంది. ఈ వర్క్ ఫ్రం హోమ్ అనేది ఇప్పుడు సాధారణ జీవితంలా మారిపోయిందని ఉద్యోగులు అంటున్నారు. పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడు 9-10 గంటల పాటు పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇప్పుడు మాత్రం వర్క్ ఫ్రం హోమ్ పేరుతో 12 గంటలకు పైగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్న ఉద్యోగులు ఎప్పుడు ఈ వర్క్ ఫ్రం హోమ్ ఆపేస్తారా అని ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ వస్తున్నాయి. ఏ పని చేసినా కుర్చీలో కూర్చొని చేయాల్సి వస్తుందని.. వర్క్‌తో మొదలుపెడితే.. ఆన్‌లైన్ ఆర్డర్స్, సినిమాలు, ఆన్‌లైన్ షాపింగ్ ఇలా ఏది చూసినా కుర్చీ, సిస్టమ్‌తో ముడిపడి ఉంది. పడుకోగానే రాత్రి కలలోకి కూడా వస్తుందని.. ఇలాగే ఉంటే జీవితం మొత్తం కుర్చీ మయం అవుతుందంటూ మీమ్స్ పెడుతున్నారు. తాజాగా ఈ మీమ్స్‌కు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వినూత్నమైన రీతిలో స్పందించాడు.
'ఆ కుర్చీ ఇప్పుడు నాకు పీడకలగా వచ్చింది. వర్క్ ఫ్రం హోమ్ ఇలాగే కొనసాగితే జీవితం మొత్తం కుర్చీకే అంకితమవుతుంది. ఆ మీమ్ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక నుంచి నా ఇంట్లో ఉన్న కుర్చీకి.. దాని ఎదురుగా ఉన్న సిస్టమ్‌కు పరిమితి సమయం ఉపయోగిస్తానని మాట ఇస్తున్నా. కానీ ఫ్రొఫెషనల్ వర్క్ చేస్తున్న ఉద్యోగులకు కుర్చీ కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవు' అంటూ కామెంట్ చేశాడు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆయన ట్వీట్‌ను 6వేలకు పైగా లైక్స్ రాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
What a nightmare. Not a future I’m ready to accept. When I saw this meme I jumped out of my chair & vowed to monitor & limit the time I spend in a chair in front of a screen every day... pic.twitter.com/HI0biamJ09
— anand mahindra (@anandmahindra) December 5, 2020
Comments
Please login to add a commentAdd a comment