ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా | Arvind Kejriwal Skips 3rd Summons Of ED | Sakshi
Sakshi News home page

మూడోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా

Published Wed, Jan 3 2024 10:07 AM | Last Updated on Wed, Jan 3 2024 11:15 AM

Arvind Kejriwal Skips 3rd Summons Of ED - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదేశాలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి బేఖాతరు చేశారు. ఈరోజు ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరుకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని పేర్కొంది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడమే కేంద్రం ఏకైక లక్ష్యమని ఆప్ ఆరోపించింది. విచారణకు గౌర్హజరుపై ఈడీకి కేజ్రీవాల్ లేఖ కూడా రాసినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి.

'ఈడి విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ ఈడీ నోటీసులు అక్రమం. ఈడీ నన్ను అరెస్టు చేయాలని భావిస్తుంది. నా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయ కారణాలతోనే ఈడీ ఈ చర్యకు దిగుతోంది.' అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నవంబర్ 2, డిసెంబరు 21న విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఈ విచారణలకు ఆయన  హాజరు కాలేదు. రెండు నోటీసుల తర్వాత కూడా ఈడీ మరోమారు నోటీసులు జారీ చేసింది. నేడు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కేజ్రీవాల్ వెళ్లడం లేదని ఆప్ తెలిపింది. ఈడీ సమన్లపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆప్‌ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు. 

ఇదీ చదవండి: కొనసాగుతున్న ఈడీ సోదాలు.. జార్ఖండ్‌ సీఎం కీలక నిర్ణయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement