సామ్రాజ్య భారతి 1859/1947లో ఇండిగో తిరుగుబాటు.. నీలిమందు విప్లవం (1859–60) మొదలైంది. ఈ విప్లవానికి మరో పేరు ఇండిగో తిరుగుబాటు. పశ్చిమ బెంగాల్‌లోని గోవిందాపూర్ గ్రామం, బీహార్‌లోని దర్భంగాలలో విష్ణుచరణ్ బిస్వాస్, దిగంబర విశ్వాస్ ఈ ఉద్యమానికి ఊపిరిలూదారు.
ఘట్టాలు
బెంగాల్ ఇండిగో రైతులు : బెంగాల్ భూస్వాముల నుంచి భూములు కౌలుకు తీసుకున్న యూరోపియన్లు ఆ భూముల్లో నీలిమందు పంటను పండించాలని రైతుల్ని నిర్బంధించారు. నీలి మందు పంటవల్ల ప్రతిఫలం సరిగా లభించకపోయినా దాన్నే పండించాల్సి రావడంతో రైతులు తీవ్ర అసంతృప్తికి గురై తిరుగుబాటు చేశారు. అప్పటి పద్ధతి ప్రకారం రైతు తన భూమిలోని 1/3వ వంతు భూమిలో నీలిమందు పంటనే పండించాలి.
చట్టాలు
సివిల్ ప్రొసీజర్ కోడ్, లిమిటేషన్ యాక్ట్, ఈస్టిండియా లోన్ యాక్ట్, ఎవిడెన్స్ బై కమిషన్ యాక్ట్, రాయల్ నేవల్ రిజర్వ్ (వలంటీర్) యాక్ట్, బ్రిటిష్ లా అసెర్టెయిన్‌మెంట్ యాక్ట్‌ల.. రూపకల్పన.
జననాలు
దొరాబ్జీ టాటా (బాంబే) : భారతీయ పారిశ్రామికవేత్త. ‘టాటా’ గ్రూపు.
కస్తూరి రంగ అయ్యంగార్(మద్రాసు): భారత స్వాతంత్య్ర సమర కార్యకర్త.‘ది హిందు’ ఆంగ్ల వార్తాపత్రికకు 1905 ఏప్రిల్ 1 నుంచి 1923 వరకు మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు.
ఎర్నెస్ట్ కేబుల్ : భారత సంతతి బ్రిటన్ వ్యాపారి, ఫైనాన్సియర్ (కలకత్తా)
Comments
Please login to add a commentAdd a comment