
సాక్షి, బెంగళూరు: మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య (71) ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కార్యక్రమాలను రద్దుచేసుకొని ఇంట్లోనే ఉన్నారు. మందుజాగ్రత్తగా మంగళవారం ఆయన మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా 72 ఏళ్ల ఆయన గతేడాది ఆగస్టులో మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో పాటు ఆయనకు కరోనా ఇన్ఫెక్షన్ కూడా సోకింది.
Comments
Please login to add a commentAdd a comment