
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. లూడో ఆట ఆడే సమయంలో తన తండ్రి తనను మోసం చేశాడని 24ఏళ్ల యువతి తన తండ్రిపై ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వివరాల్లోకెళ్తే.. ఖాళీ సమయాల్లో సదురు యవతి తన తండ్రితో లూడో గేమ్ ఆడుతూ ఉంటుంది. ఆమెకు తన తండ్రి మీద ఎంతో నమ్మకం. (కేంద్ర మాజీమంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత)
అయితే అతడు కుమార్తెతో లూడో గేమ్ ఆడే సమయంలో మోసం చేయడాన్ని భరించలేకపోయింది. దీంతో ఆ యువతి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కోర్టు కౌన్సిలర్ సరిత మీడియాతో మాట్లాడుతూ.. ఆ యువతికి తరచుగా కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఇప్పటివరకూ నాలుగుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చాము. తన తండ్రి ఆమె ఆనందం కోసం ఆటలో ఓడిపోవాలని ఆమె భావిస్తున్నది. నాలుగు రౌండ్ల కౌన్సిలింగ్ అనంతరం ఆ యువతి సానుకూలంగా స్పందిస్తున్నట్లు' కోర్టు కౌన్సిలర్ సరిత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment